Rakul Preet: అవగాహన లేక పూరీ జగన్నాథ్ చిత్రానికి నో చెప్పా 16 d ago

మోడలింగ్ రోజుల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి తనకు అంత పెద్దగా ఏమీ తెలియదని నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. మొదటి చిత్రం అవకాశం వచ్చినప్పుడు పరిశ్రమ గురించి తెలియక అంతగా ఆసక్తి చూపించలేదన్నారు. దీంతో పూరీ జగన్నాథ్ చిత్రానికి కూడా నో చెప్పానని చెప్పారు. దక్షిణాది సినిమాల గురించి అవగాహన లేకుండా ఆసక్తి చూపించలేదని ఓ ఇంటర్వ్యూలో తొలి నాటి అనుభవాలను వివరించారు. తర్వాత 'గిల్లి' సినిమాలో నటించిన ఆమె, చదువు పూర్తి చేసి సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.